Saturday, March 1, 2025
HomeTrending NewsBabu: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

Babu: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీపీ కోర్టు తీర్పు చెప్పింది.  ఈనెల 22 వరకూ రిమాండ్ కు ఇస్తూ తీర్పు చెప్పింది.  రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వు  చేశారు. పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధం విధించారు. అనంతరం సాయంత్రం 6.50గంటల ప్రాంతంలో న్యాయమూర్తి హిమబిందు తీర్పు వెల్లడించారు.

బాబుకు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన తరఫు లాయర్లు సిద్హమవుతున్నారు. రేపు హైకోర్టులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్