Sunday, January 19, 2025
HomeTrending NewsBabu Tour: పులివెందులకు చంద్రబాబు

Babu Tour: పులివెందులకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆగష్టు 2 న సిఎం జగన్  ప్రాతినిధ్యం వహిస్తోన్న  పులివెందులలో పర్యటించనున్నారు. పూల అంగళ్ళ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు,

ఆగస్ట్ 1 నుంచి 10 వరకూ ‘పెన్నా నుంచి వంశధార’ పేరుతో  రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు.  ఆగస్టు 1 న  ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను పరిశీలించి, నందికొట్కూరులో రోడ్‌ షో, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆగస్టు 2న కడప జిల్లా  కొండాపురం ప్రాజెక్టును సందర్శిస్తారు. అదే రోజు పులివెందుల, పూల అంగళ్ల సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ప్రసంగిస్తారు. ఆగస్టు 3 ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టుతో పాటు గొల్లపల్లి రిజర్వాయర్ పరిశీలిస్తారు. కియా కార్ల పరిశ్రమను కూడా సందర్శిస్తారు.  ఆగస్టు 4న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలమనేరు బ్రాంచ్‌ కెనాల్‌ ను పరిశీలన అనంతరం పూతలపట్టులో బహిరంగ సభ లో పాల్గొంటారు.  సిఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్