మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 12 నుంచి 14 వరకూ మూడు రోజులపాటు అయన పర్యటన కొనసాగనుంది.
12న కుప్పం పట్టణంలో పర్యటన, బహిరంగసభ
13న శాంతిపురం, రామకుప్పం మండలాలు, రామకుప్పంలో రోడ్ షో
14న కుప్పం, గుడుపల్లి మండలాలు
ఇటీవల వెలువడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టిడిపి అభ్యర్ధులు పోటీలో నిలబడి తమ సత్తా చాటారు. కానీ కుప్పంలో ఆ పరిస్థితి కనిపించలేదు. నిరాశలో ఉన్న పార్టీ కేడర్ లో నూతనోత్సాహం నింపేందుకు బాబు కుప్పంలో మూడురోజుల పాటు పర్యటిస్తున్నారు.