Saturday, January 18, 2025
HomeTrending Newsరేపు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం

రేపు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం

TDP formation Day:  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి రేపటికి (మార్చి 29) 40 వసంతాలు పూర్తి కావస్తోంది.  ఉభయ రాష్ట్రాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.

1982 మార్చి 29న ఆదర్శ్ నగర్  న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వ్యవస్ధాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్ ప్రకటించారు. నాటి సన్నివేశాన్ని గుర్తు చేసేలా రేపు మంగళవారం సాయంత్రం  4 గంటలకు  పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రానున్నారు. అనంతరం సాయంత్రం 5గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు.

అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నటరత్న నందమూరి తారక రామారావు కు చంద్రబాబు నివాళులర్పించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్