Saturday, January 18, 2025
HomeసినిమాChandramukhi 2: 'చంద్రముఖి 2' పై వినిపిస్తున్న టాక్ ఇదే!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ పై వినిపిస్తున్న టాక్ ఇదే!

‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతగా ఆ సినిమా అందరినీ ప్రభావితం చేసింది. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా ‘చంద్రముఖి 2’ సినిమా రానుంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కంగనా పోషించగా, మరో ప్రధానమైన పాత్రలో లారెన్స్ కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి కంగనా పోస్టర్ వదిలిన తరువాత ఒక టాక్ వచ్చింది. ఆమె ఈ పాత్రకి అంత కరెక్టు కాదేమో అని అభిప్రాయాలు వినిపించాయి. కాస్ట్యూమ్స్ అతికించినట్టుగా ఉన్నాయనే విమర్శలు వినిపించాయి.

కంగనా మంచి ఆర్టిస్ట్ అనడంలో ఎవరికి ఎలాంటి  సందేహం లేదు. అయితే ‘చంద్రముఖి’ పాత్రకి ఆమె ఎంతవరకూ నప్పింది అనే విషయంలోనే డౌట్లు ఉన్నాయి. ‘చంద్రముఖి’ పాత్రను గతంలో శోభన .. జ్యోతిక .. సౌందర్య ఇలా కొంతమంది నాయికలు చేశారు. అయితే పాత్రకి తగినట్టుగా వాళ్లందరి కళ్లు చాలా పెద్దవి .. ప్రత్యేకమైన ఆకర్షణ కలిగినవి. కంగనా గ్లామర్ లో కళ్లు ప్రత్యేక ఆకర్షణగా చెప్పలేము. ఇది ఒక లోపంగానే కొంతమంది భావిస్తున్నారు. సరే సినిమా చూసిన తరువాత ఈ అభిప్రాయం మారే ఛాన్స్ లేకపోలేదనే వాళ్లు కూడా ఉన్నారు.

కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ‘వినాయక చవితి’ పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన, ఆ రోజున కాకుండా ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.  లైకా నిర్మాణ విలువలు .. వాసు డైరెక్షన్ .. లారెన్స్ స్టైల్ .. కంగనా యాక్టింగ్ .. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్