First Omicron In Hyderabad :
బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కోరోన పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో హైదరాబాద్ లో తొలి ఓమిక్రాన్ లక్షణాలు ఉన్న వ్యక్తిగా అనుమానిస్తున్నారు. జినోమ్ GENOME సీక్వెన్స్ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ రోజు హైదరాబాద్ లో వెల్లడించారు. 20కి పైగా దేశాలలో ఒమిక్రాన్ వ్యాపించిందని, రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించామన్నారు. బ్రిటన్ కు చెందిన 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్, టిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది. జీనోమ్ సిక్వీన్స్ కి నమూనాలు పంపించామని, ఫలితాలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
Also Read : తెలంగాణలో మాస్క్ తప్పనిసరి