రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇది చరణ్ 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం.
శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయడంతో చరణ్ మూవీకి బ్రేక్ పడింది. అయితే.. ఈ గ్యాప్ లో చరణ్ వరుసగా యాడ్స్ లో నటిస్తుండడం విశేషం. ఈ యాడ్స్ కోసం గాను చరణ్ రికార్డు రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఎంతంటే.. ఇప్పుడు చేస్తున్న యాడ్స్ లో ఒకదానికి అయితే చరణ్ 7 కోట్లు ఛార్జ్ చేసినట్టుగా సమాచారం. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఆ ఒక్క యాడ్ కి అంత మొత్తంలో అందుకున్నాడా..? లేక అన్ని యాడ్స్ కి కూడా ఇదే రెమ్యునరేషనా..? అనేది మాత్రం తెలియ రాలేదు కానీ ప్రస్తుతం ఈ టాక్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఒప్పుకున్న యాడ్స్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత శంకర్ మూవీని మళ్లీ స్టార్ట్ చేయనున్నారు.