Sunday, September 8, 2024
Homeసినిమాక‌న్ ఫ్యూజ‌న్ లో చ‌ర‌ణ్... ఇంత‌కీ ఏమైంది?

క‌న్ ఫ్యూజ‌న్ లో చ‌ర‌ణ్… ఇంత‌కీ ఏమైంది?

తెలుగు సినిమా స‌త్తాను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించారు. నార్త్ లో అయితే… చ‌ర‌ణ్ పాత్ర‌ను రాముడు పాత్ర అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డంతో చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు కానీ.. చ‌ర‌ణ్ మాత్రం క్లారిటీ లేక క‌న్ ఫ్యూజన్ లో ఉన్నారు.

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో చ‌ర‌ణ్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాభై శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ఇంకా యాభై శాతం షూటింగ్ ఉంద‌న‌గా ఇండియ‌న్ 2 సినిమాని మ‌ళ్లీ స్టార్ట్ చేయాల్సిరావ‌డంతో ఈ మూవీ ఆగింది. గౌత‌మ్ తిన్న‌నూరితో సినిమా చేద్దామ‌నుకుంటే… ఆ సినిమా క‌థ చిరంజీవికి న‌చ్చ‌క‌పోవ‌డంతో క్యాన్సిల్ అయ్యింది.

క‌మ‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ మూవీని తెర‌కెక్కించిన లోకేష్ క‌న‌క‌రాజ్ తో…. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో చ‌ర‌ణ్‌ మూవీ చేయాలనుకున్నాడు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు. క‌న్న‌డ డైరెక్ట‌ర్ న‌ర్త‌న్ తో మూవీ క‌న్ ఫ‌ర్మ్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది కానీ.. అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇలా తన తదుపరి సినిమాపై  చరణ్ ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్