మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది చరణ్ 15వ చిత్రం, దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది.
దీనికి తోడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్ స్టార్ట్ చేయడంతో చరణ్, శంకర్ మూవీ ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. అయితే.. శంకర్ మాత్రం చరణ్ తో చేస్తున్న మూవీ ఆగలేదని.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఆఖరికి ఈ రోజు చరణ్, శంకర్ మూవీ మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ 5 రోజులు జరగనుందని సమాచారం.
నెక్ట్స్ షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారు. సమాజంలో అవినీతిని తొలగించి, రాజకీయ వ్యవస్థకు జీవం పోయాలని కోరుకునే నిజాయితీ గల IAS అధికారి పాత్రలో చరణ్ కనిపిస్తారు. చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
Also Read : వచ్చే నెలలో చరణ్, శంకర్ మూవీ ఫస్ట్ లుక్