చత్తీస్ ఘడ్ అట‌వీ ప్రాంతంలో పోలీసు బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం ఎదురుకాల్పులు సంభ‌వించాయి. బీజాపూర్ జిల్లా తీమేనార్, పోరేవాడ అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌తో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆ ఏరియాలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొన‌సాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *