Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ధోనీ ఆయా – సన్ రైజర్స్ గయా

ధోనీ ఆయా – సన్ రైజర్స్ గయా

Dhoni is back: ఎంఎస్ ధోనీ… చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు మళ్ళీ చేపట్టిన తొలి మ్యాచ్ లోనే ఆ జట్టు విజయం సాధించింది. చెన్నై ఇచ్చిన 203 పరుగుల విజయ లక్ష్యం సాధనలో హైదరాబాద్ సన్ రైజర్స్ పోరాడి చివరకు 13 పరుగులతో ఓటమి పాలైంది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్– 99 (57 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు); డెవాన్ కాన్వే- 85 (55 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు)తో తొలి వికెట్ కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.

పూణేలోని ఎంసిఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్- కాన్వే హైదరాబాద్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీనితో 20 ఓవర్లలో చెన్నై2  వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు హైదరాబాద్ బౌలర్ నటరాజన్ కు దక్కాయి.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ తొలి వికెట్ (అభిషేక్ శర్మ- 39)కు 58 పరుగులు చేసింది.  కెప్టెన్ విలియమ్సన్ 47 పరుగులు చేసి అవుట్ కాగా, రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. ఎడెన్ మార్ క్రమ్ కూడా (17) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. నికోలస్ పూరన్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరవిహారం చేసి నాటౌట్ గా నిలిచినా 20 రన్ రేట్ అధికంగా ఉండడంతో విజయం దక్కలేదు. హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి నాలుగు; శాంట్నర్, ప్రేటోరియస్ చెరో వికెట్ పడగొట్టారు.

రుతురాజ్ గైక్వాడ్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : పంజాబ్ పై లక్నో విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్