చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఒత్తిడిని అధిగమించి సత్తా చాటింది. 2023 ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకుంది. ప్రస్తుతం జరుగుతోంది ఐపీఎల్ 18వ సీజన్ కాగా, చెన్నై దీనితో కలిపి మొత్తం పదిసార్లు ఫైనల్ కు చేరుకోవడం విశేషం.  నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 15  పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచింది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన క్వాలిఫైర్ -1 మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్- డెవాన్ కాన్వే లు తొలి వికెట్ కు 87 పరుగులు జోడించారు. 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 60   పరుగులు చేసిన రుతురాజ్ ఔటయ్యాడు, ఫస్ట్ డౌన్ లో వచ్చిన షిశివమ్ దుబే కేవలం ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. కాన్వే 40; అజింక్యా రెహానే, అంబటి రాయుడు చెరో 17రన్స్ సాధించారు.  దోనీ కేవలం ఒక్క  పరుగే చేసి నిరాశ పరిచాడు. జడేజా 22 స్కోరు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ కాగా, మొయిన్ ఖాన్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల సష్టానికి 172 పరుగులు చేసింది.

గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ చెరో 2; దర్శన్ నల్కందే, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ సాధించారు

తర్వాత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్   22  పరుగులకు తొలి వికెట్ (వృద్ధిమాన్ సహా-12) కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (8) ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. దాసున్ శనక-17; విజయ్ శంకర్-14 రన్స్ చేయగా, డేవిడ్ మిల్లర్ (8); రాహుల్ తెవాటియా (3)  నిరాశ పరిచారు.  38  బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు సాధించిన శుభ్ మన్ గిల్ ఐదో వికెట్ గా ఔటయ్యాడు. చివర్లో రషీద్ ఖాన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి విజయంపై ఆశలు రేపినా 19వ ఓవర్ మూడో బంతికి రషీద్  ను తుషార్ దేశ్ పాండే ఔట్ చేయడంతో  హార్దిక్ సేనకు నిరాశ తప్పలేదు, ఇన్నింగ్స్ చివరి బంతికి షమీ ఔట్ కావడంతో 20 ఓవర్లు ముగిసే నాటికి 157 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, రవీంద్ర జడేజా, మతీష పథిరణ తలా రెండు, తుషార్ దేశ్ పాండే ఒక వికెట్ పడగొట్టారు.

రుతురాజ్ గైక్వాడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *