Saturday, November 23, 2024
HomeTrending Newsచెన్నై మేయర్ గా తొలిసారి దళిత మహిళ

చెన్నై మేయర్ గా తొలిసారి దళిత మహిళ

తమినాడు అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆర్ ప్రియ చెన్నై మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి దళిత మహిళగా రికార్డ్ సృష్టిస్తున్నారు. డిఎంకె నాయకత్వం ఈ రోజు(గురువారం) పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రియా పేరును ప్రకటించింది. చెన్నై కార్పొరేషన్‌లో డిఎంకెకు మెజారిటీ ఉన్నందున.. ప్రియ త్వరలో మేయర్‌గా అధికారికంగా ఎన్నిక కావటం లాంచానమే. ప్రియా తండ్రి ఆర్ రాజన్ డిఎంకె నాయకుడు. రాజకీయాల్లోకి రావటానికి కారణం ఎంటని అడిగితే తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావడం చాలా ముఖ్యం అని చెప్పారు.

ప్రియా 74వ వార్డు, మంగళపురం కౌన్సిలర్‌గా కాగా ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్ గా కూడా రికార్డ్ సృష్టించారు. ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని..రౌడీయిజం, హింస ఎక్కువగా ఉన్న ప్రదేశంగా చాలా తరచుగా తమిళ సినిమాల్లో చిత్రీకరిస్తారు. మంగళాపురం ప్రాథమిక మౌలిక సదుపాయాలకు చాలా దూరంగా ఉంటుంది. తాగునీరు నుండి విద్యుత్, పారిశుధ్యం వరకు అనేక సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు యువ కౌన్సిలర్‌ను మేయర్‌గా ఎన్నిక కావటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కౌన్సిలర్‌గా, ప్రియాకు ఇది మొదటి అధికారిక పదవి.  అయితే ఆమె 18 సంవత్సరాల వయస్సు నుండి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. తాను ఎంపికైన డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయని, రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీర్చాలని..రోడ్లను మెరుగుపరచి, విద్యుత్ సమస్యలను తీర్చాలని అవసరం ఉందని ప్రియా చెప్పారు. ప్రియా కౌన్సిలర్‌గా ఎంపిక కావడంతో మార్పు వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రియా విజయంతో మంగళాపురం పరిసర ప్రాంతాలు మారుతాయని భావిస్తున్నారు.

340 ఏళ్ళ చెన్నై కార్పోరేషన్ చరిత్రలో మేయర్ పదవి అలంకరించిన మూడో మహిళగా ప్రియ పేరు సంపాదించారు. గతంలో 1957లో స్వతంత్ర అభ్యర్థిగా తారా చెరియన్ మద్రాస్ నగరానికి మేయర్ గా వన్నె తెచ్చారు. 1971-72 లో కామాక్షి జయరామన్ చెన్నై రెండో మహిళా మేయర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. తారా చెరియన్, కామాక్షి జయరామన్ తర్వాత ప్రియా చెన్నైకి మూడవ మహిళా మేయర్ గా పదవిని చేపట్టనున్నారు. కామాక్షి జయరామన్, ప్రియా ఇద్దరు మహిళలు డిఎంకే పార్టీ నుంచే ఎన్నిక కావటం కాకతాళీయం.  చెన్నై కార్పొరేషన్‌లో కౌన్సిలర్ పదవిని గెలుచుకున్న అనేక మంది యువ అభ్యర్థులలో ప్రియ కూడా ఒకరు. తమిళనాడులోని DMK మిత్రపక్షమైన CPI(M)కి చెందిన ప్రియదర్శిని (21) పిన్నవయస్కురాలు కాగా తీనాంపేట 98వ వార్డు నుంచి ఆమె  గెలుపొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్