Sunday, September 8, 2024
Homeసినిమా'అన్నీ మంచి శకునములే'.. 'పెళ్లి సందడి' అంత పెద్ద విజయం సాధిస్తుంది - రాఘవేంద్రరావు

‘అన్నీ మంచి శకునములే’.. ‘పెళ్లి సందడి’ అంత పెద్ద విజయం సాధిస్తుంది – రాఘవేంద్రరావు

స్వప్న సినిమా నుండి ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడానికి ముందు మ్యూజికల్ హిట్స్. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు పోషించిన మరో మ్యూజికల్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ తో వస్తున్నారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి ఇతరులు ముఖ్య పాత్రాలు పోషించారు. మేకర్స్ ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పాటలు పెద్ద హిట్ అయ్యాయి.

ఇప్పుడు ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం’ అనే పాటను విడుదల చేసారు. ఇది పెళ్లి వేడుక. మిక్కీ జే మేయర్ ఆహ్లాదకరమైన వెంటనే కనెక్ట్ అయ్యే సిట్యుయేషనల్ ట్రాక్‌ ని స్కోర్ చేసారు. వివాహ వేడుకలు ఎలా ఉంటాయో, ఎలాంటి సన్నాహాలు జరుగుతాయో చంద్రబోస్ సరిగ్గా వివరించారు. ఇది ప్రధానంగా వివాహ విందు గురించిన పాట. శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి వాయిస్ లు మరింత ప్రత్యేకతను చాటాయి. నటీనటులందరూ కలిసి ఈ వేడుకను జరుపుకోవడం ఒక కన్నుల పండుగ. ఈ పాటకు బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. నా సినిమాలకి హీరోయిన్ ముఖ్యం. అందుకే ముందు హీరోయిన్ గురించే మాట్లాడతా. (నవ్వుతూ) ఈ సినిమా లో హీరోయిన్ చాలా అందంగా వుంది. సంతోష్ శోభన్ కి అల్ ది బెస్ట్. నందిని, స్వప్న, ప్రియాంక .. ముగ్గురూ తెలివైన వాళ్ళు. దత్ గారి బ్యానర్ లో దాదాపు 14 సినిమాలు తీశాను. దాదాపు అన్నీ హిట్స్. రాజకుమారుడితో మహేష్ బాబు, స్వప్న బ్యానర్ లో ఎన్టీఆర్, అలాగే అల్లు అరవింద్, అశ్వనీదత్ తో కలసి అల్లు అర్జున్ ని పరిచయం చేశాం. ఈ ముగ్గురిని డైరెక్ట్ చేసేవారు వస్తే బావుంటుందని ప్లాన్ చేసి నన్ను ఈ ఈవెంట్ కి పిలిచినట్లు అనిపిస్తుంది(నవ్వుతూ). కాబట్టి అన్నీ మంచి శకునములే. ఈ పాట చూసినప్పుడు పెళ్లి సందడి చూసినంత ఆనందం కలిగింది. పెళ్లి సందడి అంత పెద్ద విజయం ఈ సినిమా సాధిస్తుంది’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్