Thursday, May 8, 2025
HomeTrending Newsశ్రీవారి సేవలో చీఫ్ జస్టిస్

శ్రీవారి సేవలో చీఫ్ జస్టిస్

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆరో రోజు  శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతుల వారితో  భక్తులకు దర్శనమిచ్చారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సతీ సమేతంగా ఈ స్వామివారి సేవలోపాల్గొన్నారు. అంతకుముందు అయన  శ్రీవారిని దర్శించుకున్నారు.

రంగనాయకుల మండపంలో  టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి  స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని చీఫ్ జస్టిస్ కు అందించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు.  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా దంపతులు కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి కూడా స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్