Sunday, January 19, 2025
HomeTrending Newsఎల్బీన‌గ‌ర్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి భూమిపూజ‌

ఎల్బీన‌గ‌ర్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి భూమిపూజ‌

హైదరాబాద్ ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ రోజు( మంగళవారం) భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కిష‌న్ రెడ్డి, జైపాల్ యాద‌వ్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

21.36 ఎక‌రాల్లో జీ ప్ల‌స్ 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. ఎల్బీన‌గ‌ర్ మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 300 ఐసీయూ బెడ్స్, 16 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు ఉండేలా ఆస్ప‌త్రి నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు.

Also Read : భారత మెడికల్ హబ్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్