Saturday, January 18, 2025
Homeఅంతర్జాతీయంచైనా త్రీ చైల్డ్ పాలసీ

చైనా త్రీ చైల్డ్ పాలసీ

చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశంలోని పౌరులు ముగ్గురు పిల్లలు కనేందుకు అనుమతించింది. అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకూ అనుసరిస్తున్న ‘టూ చైల్డ్’ పాలసీ విఫలమైందని అంగీకరించింది.

ఇటీవలే విడుదలైన చైనా జనాభా లెక్కల్లో గత ఏడాది 2020లో కేవలం కోటి 20 లక్షల మంది చిన్నారులు మాత్రమే జన్మించారు…1961 నుంచి పోల్చుకుంటే ఇది అతి స్వల్పమని వెల్లడైంది. దీంతో అధికార పార్టీ జనాభా విధానంలో కొన్ని మార్పులు చేయాలని భావించింది. టూ చైల్డ్ పాలసీ వల్ల దేశంలో బర్త్ రేట్ గణనీయంగా పడిపోయిందని, వృద్ధుల సంఖ్య ఎక్కువవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 2020 జనాభా లెక్కల్లో వెల్లడైన గణాంకాలు చైనా పాలకులను కలవరపెడుతున్నాయి. సంతానోత్పత్తి రేటులో తగ్గుదలను తీవ్రంగా పరిగణిసున్నారు.

గత దశాబ్దంతో పోల్చితే ఈసారి 5.38 శాతం జానాభా పెరిగినప్పటికీ… దేశ భౌగోళిక పరిస్థితుల నేపధ్యంలో ఇది సరిపోదని చైనా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే అతికొద్ది సంవత్సరాల్లో పారిశ్రామిక రంగానికి కార్మికుల కొరత ఏర్పడుతుందని….వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, ఉత్పాదకత పడిపోయి ఆర్ధిక రంగం కుదేలవుతుందని ఆందోళన చెందుతున్నారు.

దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా గతంలో జనాభా తగ్గుదలకు ‘వన్ ఆర్ నన్’ అంటూ నిబంధన పెట్టింది. ఆ తర్వాత ‘వన్ చైల్డ్’ పాలసీ తెచ్చింది.. ఆ తర్వాత ‘టూ చైల్డ్’ కు మార్చింది. తాజాగా ఇప్పుడు ‘త్రీ చైల్డ్’ కు అభ్యంతరం లేదని చెబుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్