ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, తాలిబాన్ విధానాల్ని చైనా నిశితంగా గమనిస్తోంది. నాటో బలగాలు వెనక్కి వెళ్ళగానే కాబుల్ లో అడుగు పెట్టాలని డ్రాగన్ ఉవ్విలూరుతోంది. ఆఫ్ఘన్లో అడుగు పెడితే గల్ఫ్ దేశాల వ్యవహారాల్లో తలదూర్చి, ఆఘమేఘాల మీద సైనిక బలగాల్ని ఆ ప్రాంతంలో దించే వ్యూహంతో చైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ద్వారా త్వరగా ఆఫ్రికా చేరుకునే వీలు కుడా ఉంది.
కాబుల్ అధికార వర్గాలతో ఇప్పటికే లోపాయికారి మంతనాలు చేస్తున్న చైనా సెప్టెంబర్ తర్వాత ఏ క్షణమైనా ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటికే చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ ను భాగస్వామి చేసి తద్వారా ముందుగా రోడ్లు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తుంది. పాకిస్తాన్, ఇరాన్ సహకారంతో తాలిబాన్ ఉగ్రవాదులతో సఖ్యత సాధించవచ్చనే ధీమాతో చైనా ఇప్పటికే ప్రణాలికలు సిద్దం చేసింది. అయితే ఆఫ్ఘన్ లో డ్రాగన్ జిత్తులమారితనంపై తాలిబాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.
కష్టాల్లో ఉన్న పేద దేశాలకు అభివృద్ధి పేరుతో అప్పులు ఇవ్వటం, అలవికాని నిభందనలు పెట్టి ఆయా దేశాల సహజవనరులు కొల్లగొట్టడం చైనా పాలసీగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో చైనా కు భంగపాటు తప్పదంటున్నారు అంతర్జాతీయ విశ్లేశేకులు. తాత్కాలికంగా లబ్ది చేకూరే అవకాశం ఉన్నా కాలం గడచిన కొద్ది చైనా కు తాలిబాన్ తో తలనొప్పులు తప్పవంటున్నారు. ఉయ్ ఘుర్స్ ను ఉచకోత కోస్తూ సాముహిక హననం చేస్తున్న చైనా పై తాలిబాన్ తిరగబడుతుందని అంచనా వేస్తున్నారు.