Saturday, November 23, 2024
HomeTrending Newsచైనా నగరాల్లో మళ్ళీ లాక్ డౌన్

చైనా నగరాల్లో మళ్ళీ లాక్ డౌన్

China Lock Down :

భారతదేశంలో కరోనా మూడో దశ సద్దుమణిగిందని ప్రజలు, ప్రభుత్వం ధీమాగా ఉన్న వేళ, చైనాలో పరిస్థితి మరోసారి దారుణంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజులుగా చైనాలోని పలు కీలక నగరాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. జిలిన్ నగరంలో నిన్న(ఆదివారం) ఒకరోజే 895 కేసులు రావటంతో లాక్ డౌన్ విధించారు. ఇప్పటికే దక్షిణ చైనాలోని ప్రముఖ నగరం షెన్‌ జెన్‌ లో కొత్తగా కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం లాక్‌ డౌన్ విధించింది. షెన్‌ జెన్ నగరంలో 90లక్షల జనాభా ఉంది. వీరంతా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితం అయ్యారు. షెన్ జెన్ తర్వాత షాండాంగ్ ప్రావిన్స్ లోని యుచెంగ్ నగరంలో కూడా లాక్ డౌన్ విధించారు. ఇక్కడ 5లక్షల మంది ప్రజలు నివసిస్తుంటారు. 24 మిలియన్ల జనాభా ఉన్న జిలిన్ ప్రావిన్స్ తో పాటు రాజధాని చాంగ్‌ చున్‌ లో ఇప్పటికే లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

చైనాలోని మూడు ప్రధాన నగరాలు ఇప్పుడు ఆంక్షల వలయంలో చిక్కుకున్నాయి. వారం రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. వాస్తవానికి కేసుల సంఖ్య ఒకటి దాటినా ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు. జీరో కేసులు టార్గెట్ గా చైనా అధికారులు పని చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరిగితే అక్కడ ఆంక్షలు కటినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడు నగరాల ప్రజలు ఆంక్షలతో విలవిల్లాడిపోతున్నారు. సాధారణ జనజీవనం స్తంభించడంతో ఇబ్బందులు తప్పడంలేదు.

హువావే, టెన్‌ సెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల హెడ్ ఆఫీస్ లన్నీ చైనాలోని షెన్‌ జెన్‌ నగరంలో ఉన్నాయి ప్రస్తుతం ఈ నగరం లాక్ డౌన్ లో ఉంది. దీంతో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ఈ నగరం హాంకాంగ్‌ కి సరిహద్దుగా ఉండటంతో అక్కడి ప్రజలు కూడా హడలిపోతున్నారు. రెండేళ్ల తర్వాత చైనాలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. మొత్తం నగరాలకు నగరాలే లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో పాఠశాలలు, మాల్స్, పార్క్‌ లను అధికారులు మూసివేశారు. బీజింగ్‌ లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుంపులుగా తిరగడం నిషేధం. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: శ్రీలంకలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్