Saturday, November 23, 2024
HomeTrending Newsబరితెగించిన చైనాకు భారత్ షాక్

బరితెగించిన చైనాకు భారత్ షాక్

అత్యాధునిక స్పైషిప్‌ను శ్రీలంక ఓడరేవులో లంగరు వేసి.. భారత మిలిటరీకి చెందిన అత్యంత రహస్యమైన కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్‌ను పసిగట్టాలని చైనా అధ్యక్షుడు షి జింగ్-పింగ్ వేసిన ఎత్తును దీటుగా చిత్తు చేసి అంతర్జాతీయంగా షి జింగ్-పింగ్‌ను మరోసారి పరాభవానికి గురిచేసి భారత్ చావుదెబ్బ తీసింది. శ్రీలంక ఓడరేవు హంబాన్ టోటలో లంగరు వేసిన చైనా గూఢచారి నౌకపై నిరంతరం నిఘా వేసి నౌకపై జరుగుతున్న ప్రతి కదలికను, చర్యను నిశితంగా గమనించడమే గాకుండా.. ఆ నౌకపై అమర్చిన కమ్యూనికేషన్ వ్యవస్థను ఆమూలాగ్రం స్టడీ చేసేలా.. భారతీయ సైనిక ఉపగ్రహాలు “రుక్మిణి మరియు యాంగ్రీ బర్డ్..” లను భారత్ వినియోగించింది.

చైనా యుద్ద నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన దగ్గర్నుండీ.. భారత మిలిటరీ శాటిలైట్లు.. చైనా స్పైషిప్‌ పైనే నిరంతరం నిఘా వేశాయి. అంతరిక్షం నుండి.. ఓడ మీద జరుగుతున్న ప్రతి కదలికను డేగ కళ్ళతో నిశితంగా గమనిస్తాయి.  అక్కడితో ఆగకుండా షిప్ మీద చైనా మిలిటరీ గూఢచార విభాగం నెలకొల్పిన రిసీవర్ యాంటెన్నాలను అధికమొత్తం జంక్ డేటాతో ముంచెత్తడం ప్రారంభించాయి. దాంతో షిప్‌ పైనున్న హార్డ్‌డిస్క్‌లన్నీ క్షణాల్లో నిండిపోగా… పనికిమాలిన సమాచారాన్ని తొలగించి.. డేటా నిల్వకు డిస్క్‌లను సిద్ధం చేయడానికి మళ్ళీమళ్ళీ ఫార్మాట్ చేయాల్సి వచ్చింది. దీంతో షిప్‌ పైనున్న చైనా మిలిటరీ ఎక్స్‌పర్ట్‌లే గాకుండా.. ఈ షిప్ నుండి ప్రసారమౌతున్న చెత్తను బ్యాకప్ చేసే మెయిన్ ల్యాండ్ చైనాలోని మిలిటరీ ప్రధాన స్థావరంలోని సర్వర్లు కూడా నిండిపోతుండడంతో.. అక్కడి సాంకేతిక నిపుణులకు కూడా దిక్కుతోచక దిగాలు పడ్డారు. ఈ విషయం షి జింగ్-పింగ్ వరకు చేరడంతో కోపోద్రిక్తుడై.. ఈ స్పై షిప్‌ను శ్రీలంకకు పంపించి.. దేశానికి దక్షిణ భాగాన.. భారత మిలిటరీ అత్యంత రహస్యంగా మొహరించిన మిలిటరీ “వ్యూహాత్మక మిస్సైల్ కమ్యూనికేషన్ అండ్ కమాండ్ సెంటర్ల” రహస్య సంకేతాలను సేకరిద్దామన్న ఆలోచన ఇచ్చిన పీఎల్ఏకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ టాప్ ఎక్స్‌పర్ట్‌ను ఉద్యోగంలోంచి తొలగించి ఇంటికి పంపించారు.

చైనా దుస్సాహసాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేవలం చమురు నింపుకునేందుకు శ్రీలంక ఓడరేవు హంబాన్ టోటకు  యుద్ద నౌక వచ్చిందని సిలోన్ పాలకులు చెప్పారు. చైనా గూడాచార నౌక రెండు రోజుల క్రితమే శ్రీలంక నుంచి సింగపూర్ వెళ్ళింది.

భారత శాటిలైట్స్ ఎడతెరిపి లేకుండా ప్రసారం చేస్తోన్న పనికిమాలిన డేటాతో షిప్‌లోని స్టోరేజ్ డిస్క్‌లు క్షణాల్లో నిండిపోతున్నాయ్. ఇప్పుడు చైనీస్ స్పై షిప్‌ల కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌లు, వాటి ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ మరియు అనేక ఇతర ప్రామాణిక చైనా మిలిటరీ సాంకేతిక సమాచారాన్ని…  EMISAT (భారత్ మిలిటరీ శాటిలైట్లు) ద్వారా భారత్ ఇప్పటికే పసిగట్టేసింది. ఈ సమాచారంతో ముందు ముందు చైనా మిలిటరీ.. భూతలం, సముద్రజలాల్లో వినియోగించే రాడార్‌ల విద్యుదయస్కాంత వర్ణపటాన్ని కొలవడానికి, తరంగాల ఉనికిని గుర్తించి తద్వారా అవి ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడానికి భారత మిలిటరీ నిపుణులకు తేలికవుతుంది. చైనాకు ఇదొక అతి పెద్ద తలనొప్పిగా పరిణమించనుంది.

చైనీస్ స్పై షిప్ శ్రీలంక జలాల్లోకి ప్రవేశించే ముందే.. భారతదేశం తన మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థ నుండి.. హ్యాండ్ షేకింగ్ ప్రోటోకాల్స్‌తో సహా.. ఒక్క బైట్ సమాచారం కూడా ప్రసారం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అత్యంత వ్యూహాత్మకంగా భారత్ అమలు చేసిన పద్మవ్యూహంలో చిక్కుకుని చైనా చిత్తైంది. భారత DRDO, ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అత్యుత్తమ సాంకేతికత కలిగిన భారత నౌకాదళానికి చెందిన రెండు ప్రపంచ స్థాయి నావికా గూఢచారి నౌకలు.. ఏదైనా అనుకోని సమస్య తలెత్తితే రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి.

భారత్‌కు పెనుముప్పుగా పరిణమించాలని చైనా వేసిన ఎత్తుగడను చాకచక్యంగా భారత్ ఎదుర్కోవడమే గాక.. చైనానే ముప్పుతిప్పలు పెట్టిన తీరు పట్ల అంతర్జాతీయ నిఘా నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ అనుభవంతో ఏ ఇతర దేశమైనా.. స్పై షిప్‌తో భారతదేశ మిలిటరీపై గూఢచర్యం చేయాలని తలపోసే ముందు.. భారతదేశ స్పేస్ బోర్న్ ELINT సిస్టమ్ “కౌటిల్య” గుర్తుకొస్తుంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్