తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘విమానం’. విలక్షణ నటుడు సముద్రఖని ఇందులో వీరయ్య అనే మధ్య వయస్కుడి తండ్రి పాత్రలో నటించారు. ప్రతీ తండ్రి తన కొడుకుని ఉన్నతంగా చూసుకోవాలని అనుకుంటాడు. విమానం సినిమాలోనూ సముద్రఖని అంగ వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ, భార్య లేకపోయినప్పటికీ కొడుకుని ప్రేమగా పెంచుకుంటాడు. అలాంటి తండ్రీకొడుకుల మధ్య ప్రేమానుబంధాన్ని గొప్పగా ఆవిష్కరించేలా ‘సిన్నోడా ఓ సిన్నోడా..’. అనే పాటను రూపొందించారు.
అయితే సదరు పాటలోని ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూపించేలా సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాటను రాయటం విశేషం. ప్రముఖ సింగర్ మంగ్లీ పాటను తనదైన స్టైల్లో ఎంతో శ్రావ్యంగా ఆలపించినట్లు సాంగ్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. జూన్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అలాగే చిత్ర నిర్మాతలు ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించారు. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బహుమతులను కూడా అందిస్తామని మేకర్స్ ప్రకటించారు.