Wednesday, January 22, 2025
Homeసినిమాచిరు, మల్లిడి వశిష్ట్ మూవీ టైటిల్ ముల్లోకవీరుడు..?

చిరు, మల్లిడి వశిష్ట్ మూవీ టైటిల్ ముల్లోకవీరుడు..?

చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు కానీ.. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్, కళ్యాణ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ముందుగా మల్లిడి వశిష్ట్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది బింబిసార మూవీ వలే సోషియో ఫాంటసీ మూవీ అని టాక్. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందట. జ‌గ‌దేక వీరుడులో స్వ‌ర్గం నుంచి.. శ్రీ‌దేవి దిగి వ‌స్తుంది. ఇక్క‌డ కూడా అలాంటి సెట‌ప్పే ఉంద‌ట. కాక‌పోతే.. స్వ‌ర్గం నుంచే కాదు.. ముల్లోకాల నుంచీ.. హీరో కోసం క‌థానాయిక‌లు భూమ్మీద‌కు దిగుతార‌ని స‌మాచారం. అది కూడా ఎనిమిది మంది కథానాయికలు హీరో కోసం భూమి మీదకు రావడం అనేది ఆసక్తిగా ఉంటుందట. అందుకనే ఈ చిత్రానికి ‘ముల్లోకవీరుడు’ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట. మరి.. ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్