Sunday, January 19, 2025
HomeసినిమాChiranjeevi: కూతురు కోసం సినిమా చేస్తున్న మెగాస్టార్..?

Chiranjeevi: కూతురు కోసం సినిమా చేస్తున్న మెగాస్టార్..?

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన చిరు ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తమన్నా కథానాయికగా కాగా.. చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. హీరో సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ కలకత్తాలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమా తర్వాత ఎవరితో మూవీ చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పారని తెలిసింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి కుమార్తె సుస్మిత గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఓటీటీ కంటెంట్ మాత్ర‌మే వ‌చ్చింది. సంతోష్ శోభ‌న్‌తో ఓ చిన్న సినిమా చేశారు కానీ.. సక్సెస్ కాలేదు. గోల్డ్ బాక్స్ బ్యాన‌ర్‌లో చిరంజీవి ఓ వెబ్ సిరీస్ చేస్తార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి కానీ అదీ ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు త‌న కూతురు సుస్మిత కోసం ఓ సినిమా చేయ‌డానికి ఫిక్స్ అయ్యారట.

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చేయాలనుకున్న సినిమాను గోల్డ్ బాక్స్ బ్యానర్ లో చేయాలని డిసైడ్ అయ్యారట. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్ జ‌రుగుతుంది. చిరు రీ ఎంట్రీ త‌ర్వాత… కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ లో మూడు సినిమాలు చేశారు. ఆ చిత్రాలకు రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. ఆచార్య త‌ర్వాత.. చ‌ర‌ణ్ ప్రొడ‌క్ష‌న్ గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే ఈసారి కూతురి బ్యాన‌ర్‌లో సినిమా చేయాల‌ని చిరు ఫిక్స్ అయ్యాడని సమాచారం. మరి.. ఈ సినిమాతో అయినా సుస్మితకు సక్సెస్ వస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్