Sunday, January 19, 2025
Homeసినిమాచిరంజీవి కొత్త సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

చిరంజీవి కొత్త సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. భోళా శంకర్ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారో ప్రకటించలేదు కానీ.. కళ్యాణ్‌ కృష్ణ, మల్లిడి వశిష్ట్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో సమాంతరంగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణతో చేయనున్న సినిమాని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

అయితే.. కళ్యాణ్ కృష్ణతో చేయనున్న సినిమా మలయాళంలో విజయం సాధించిన బ్రో డాడీ సినిమాకి రీమేక్ అని.. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది కానీ.. తాజా సమాచారం ప్రకారం ఇది రీమేక్ మూవీ కాదట. తెలుగు కథతో రూపొందే సినిమా అని..  ఈ ఓరిజినల్ స్టోరీని ధమాకా రైటర్ బెజవాడ ప్రసన్న రెడీ చేశాడని తెలిసింది. చిరు కామెడీ టైమింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అదిరిపోయే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ స్టోరీని రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్.

చిరుకు జంటగా త్రిష నటిస్తుంటే… సిద్దు జొన్నలగడ్డకు జంటగా శ్రీలీల నటిస్తుందని సమాచారం. ఇందులో చిరు, సిద్ధు తండ్రీకొడుకులుగా నటించనున్నారని.. వీరిద్దరి మధ్య సన్నవేశాలు బాగా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయని తెలిసింది. బంగార్రాజు సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ ఒకటి రెండు కథలు అనుకున్నాడు కానీ సెట్ కాలేదు. ఇప్పుడు చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ కావడంతో ఫుల్ జోష్ తో వర్క్ చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు చిత్రాలతో సక్సెస్ సాధించిన కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్ ను ఎలా చూపించనున్నాడో అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్