Sunday, January 19, 2025
Homeసినిమారవితేజ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్

రవితేజ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్

రవితేజ ఇటీవల ‘ధమాకా’ మూవీతో ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. అంతకు ముందు వరుసగా ఫ్లాప్స్ చూసిన రవితేజ ధమాకా సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ సాధించారు. 100 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించారు. ఈ సినిమాకి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. దీంతో నక్కిన పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ నక్కినతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇంత వరకు నక్కిన నెక్ట్స్ ఏంటి అనేది ప్రకటించలేదు. అయితే… నక్కిన త్రినాథరావుతో మెగాస్టార్ చిరంజీవి కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామన్నారట.

ఇది నక్కినకు బంపర్ ఆఫరే. ఇక త్రినాధరావు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మెగాస్టార్ దగ్గరికి వెళ్లి ఒప్పిస్తే ఈ ప్రాజెక్టు అయితే సెట్స్ పైకి వస్తుంది అని చెప్పవచ్చు. అలాగే మరొక వైపు త్రినాధరావు గతంలో అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సక్సెస్ అందుకుంటే కనుక అతను మరో రేంజ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే ప్రాజెక్టును డివివి.దానయ్య నిర్మించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ వినిపిస్తోంది.

దానయ్య.. చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. వెంకీ కుడుములతో చిరంజీవికి కథ చెప్పించాడు కానీ.. సెట్ కాలేదు. ఇప్పుడు నక్కిన మంచి కథతో వస్తే.. ఈ సినిమాను డివివి దానయ్యకు చేయాలని చిరంజీవి అనుకుంటున్నారట. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం భోళా శకంర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరితో అనేది కన్ ఫర్మ్ కాలేదు. అందుచేత ఈలోపు నక్కిన చిరంజీవిని మెప్పిస్తే… భోళా శంకర్ తర్వాత చేసే సినిమా ఇదే అవుతుంది. మరి.. నక్కిన చిరును కథతో మెప్పిస్తాడో..? లేదో..? చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్