Wednesday, September 25, 2024
HomeసినిమాChiranjeevi congratulates Virupaksha: 'విరూపాక్ష'కు చిరంజీవి అభినందనలు

Chiranjeevi congratulates Virupaksha: ‘విరూపాక్ష’కు చిరంజీవి అభినందనలు

సాయిధరమ్‌ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. ఈ చిత్రం శుక్రవారం  ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదట్నుంచీ పాజిటివ్ బజ్‌తో కొనసాగుతున్న ఈ చిత్రం విడుదలైన మార్నింగ్ షో నుండే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్తమీనన్ నటించింది. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో యువ నిర్మాత బాపినీడు సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మిస్ట్రీక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం పై ప్రేక్షకులతో పాటు హీరోలు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి, సాయిధరమ్‌తేజ్‌కు, చిత్ర యూనిట్‌కు తన అభినందనలు తెలియజేశారు. విరూపాక్ష చిత్రంకు వస్తున్న అద్బుతమైన స్పందన చూస్తుంటే ఆనందంగా వుంది. తేజ్ మళ్లీ ఓ బ్లాక్‌ బస్టర్ విజయంతో ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీగా వుంది. విరూపాక్ష చిత్రానికి ఆడియన్స్ ప్రశంసలు, అభినందనలు అందించడం ఎంతో సంతోషం. ఈ సందర్భంగా విరూపాక్ష చిత్రానికి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, టోటల్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్