Tuesday, December 24, 2024
Homeసినిమాగౌతమ్ రాజు కుటుంబానికి 'మెగా' సాయం

గౌతమ్ రాజు కుటుంబానికి ‘మెగా’ సాయం

Helping Hand: టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 800 పైగా సినిమాలకు పని చేశారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల క్రితమే హాస్పిటల్లో చేరారు. కొన్నిరోజులు క్రితమే డిస్చార్జ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.

ఆయన మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాక ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆ కుటుంబానికి తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలను  తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా చిరంజీవి అందజేశారు. భరద్వాజ  ఈ సాయాన్ని గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు అందజేశారు. అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని చిరంజీవి వారి కుటుంబానికి చెప్పమన్నట్లు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సందర్భంగా తెలియచేశారు.

Also Read : గౌతమ్ రాజు కుటుంబానికి ‘మెగా’ సాయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్