Sunday, January 19, 2025
HomeTrending NewsChiranjeevi: మెగాస్టార్ కు అరుదైన పురస్కారం

Chiranjeevi: మెగాస్టార్ కు అరుదైన పురస్కారం

Puraskar: మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా సందర్భంగా చిరంజీవిని ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ద ఇయర్ 2022గా ప్రకటించారు.  గోవాలో నేడు ప్రారంభమైన ఈ సినీ వేడుకలు ఈనెల 28 వరకూ జరుగుతాయి.  కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్ లో 150కి పైగా చిత్రాలతో చిరంజీవి గారు తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారని కొనియాడారు. నటుడిగా, డాన్సర్ గా, నిర్మాతగా సినిమా రంగానికి అపార సేవలు అందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి గోవా వెళ్లనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్