Saturday, January 18, 2025
Homeసినిమాచిరు పాన్ ఇండియా మూవీ?

చిరు పాన్ ఇండియా మూవీ?

చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’  రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం  మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు.  ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ కూడా ముఖ్యపాత్ర పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరుకు జంటగా త్రిష నటిస్తుంటే.. సిద్దు జొన్నలగడ్డకు జంటగా శ్రీలీల నటిస్తుందని సమాచారం.

ఇదిలా ఉంటే.. గతంలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీ చేశారు. ఇప్పుడు మళ్లీ చిరు పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్   రూపొందిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీలో చిరు నటిస్తున్నారు. ఇది . ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోన్న  టున్తోంన ఈ   పాన్ ఇండియా మూవీగా చేయాలి అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

ఇది జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తరహాలో ఉంటుందట. వచ్చే సంవత్సరం ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. సైరా నరసింహారెడ్డి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాలి అనుకున్నారు కానీ.. వర్కవుట్ కాలేదు. అందుచేత ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాలని చిరు చాలా పట్టుదలగా ఉన్నారట. ఇదే కనుక నిజమైతే.. ఈ మూవీ అయినా.. చిరుకు పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్