CM Jgan – Chiranjeevi Meeting: సినీ నటుడు చిరంజీవి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన నివాసంలో కలుసుకోనున్నారు. సిఎంతో కలిసి చిరంజీవి లంచ్ చేయనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల విషయమై సిఎంతో చర్చించనున్నారు. ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం, సినిమా థియేటర్లపై అధికారుల తనిఖీలు… పలు సినిమా థియేటర్లు స్వచ్చందంగా మూసివేత లాంటి అంశాల నేపథ్యంలో ఈ మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇటీవలి కాలంలో సినిమా రంగంపై పలువురు వైసీపీ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై పలువురు నిర్మాతలు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు, దర్శకులు కూడా అంటే స్థాయిలో ప్రతిస్పందించారు.
ప్రభుత్వానికి-సినీ రంగానికి మధ్యలో ఏర్పడిన అగథాన్ని కొంత మేర తగ్గించేందుకు, సినీ రంగ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు నేటి జగన్-చిరంజీవి మీటింగ్ దోహదం చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
Also Read : పెద్దరికం నాకొద్దు: చిరంజీవి