Friday, April 19, 2024
Homeసినిమాచిరంజీవి, మారుతి సినిమా ఉంటుందా?

చిరంజీవి, మారుతి సినిమా ఉంటుందా?

Not now: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ఎలాంటి ఫ‌లితాన్ని అందించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమా రిజెల్ట్ చూసిన త‌ర్వాత ఇక నుంచి చేసే సినిమాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చిరంజీవి ఫిక్స్ అయ్యార‌ట‌. ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, వాల్తేరు వీర‌య్య సినిమాల్లో న‌టిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వ‌ర‌కు కొత్త‌గా ఏ సినిమాకి ఓకే చెప్ప‌కూడ‌దని చిరు డిసైడ్ అయ్యార‌ట‌.

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంద‌రి స‌మ‌క్షంలో మారుతితో సినిమా చేస్తానని చిరంజీవి స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఇప్పుడు ఈ మూవీ డౌట్ లో ప‌డింద‌ని టాక్ వినిపిస్తోంది. కార‌ణం ఏంటంటే… ఆచార్య త‌ర్వాత జ‌నాలు ఏ క్యారెక్ట‌ర్ లో తనను  ప్రేక్షకులు  ఆదరిస్తారో  తెలుసుకోవాలనుకుంటున్నార‌ట చిరంజీవి. అందుచేత సెట్స్ పై ఉన్న సినిమాలు రిలీజ్ అయితే క్లారిటీ వ‌స్తుంద‌ని వెయిట్ చేస్తున్నార‌ట‌.

ఈ మూడింటి త‌ర్వాతే కొత్త సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తార‌ని సమాచారం. మారుతి అద్భుత‌మైన క‌థ‌తో మెప్పిస్తే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. లేక‌పోతే ఈ ప్రాజెక్ట్ డౌటే అని టాక్ వినిపిస్తోంది. అందుచేత‌ ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్