Thursday, May 30, 2024
Homeసినిమాబ‌న్నీ.. ఆ డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా?

బ‌న్నీ.. ఆ డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా?

Next movie fixed? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌ సంచ‌ల‌న విజ‌యం సాధిచ‌డంతో  పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబ‌ర్ లో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. 2023 చివర్ఎంలో లేదా 2024 మొదట్లో ఈ సినిమా రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. పుష్ప 2 త‌ర్వాత అల్లు అర్జున్ సినిమా ఎవరితో అనేది ఇప్పటి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. ఇప్పుడు బ‌న్నీ, కొర‌టాల శివ మ‌ధ్య క‌థాచ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. కొర‌టాల చెప్పిన స్టోరీ న‌చ్చ‌డంతో బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రూ క‌ల‌సి ఎప్ప‌టి నుంచో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్ కాలేదు. ఈసారి మాత్రం ఈ కాంబినేష‌న్లో మూవీ ప‌క్కా అని అంటున్నారు.

కొర‌టాల ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళుతుంది. ఈ మూవీ కంప్లీట్ చేసిన త‌ర్వాత బ‌న్నీతో కొర‌టాల మూవీ స్టార్ట్ అవుతుంద‌ని స‌మాచారం. బ‌న్నీకి ఇప్పుడు ఉన్న ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేశార‌ట‌. అందుక‌నే బ‌న్నీ కొర‌టాల క‌థ‌కు ఓకే చెప్పార‌ట‌. మ‌రి.. బ‌న్నీని ప‌వ‌ర్ ఫుల్ గా కొర‌టాల ఎలా చూపిస్తారో చూడాలి.

Also Read : అల్లు అర్జున్ అన్న నాకు స్ఫూర్తి : విజయ్ దేవరకొండ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్