Saturday, January 18, 2025
Homeసినిమామిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టికి చిరంజీవి అభినందనలు

మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టికి చిరంజీవి అభినందనలు

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సెప్టెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాని ప్రత్యేకంగా చిరంజీవికి చూపించారు. ఈ సినిమా చూసిన అనంతరం చిరంజీవి తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.


ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే… ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ ని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్