Friday, September 20, 2024
HomeసినిమాMega157: 'మెగా157' ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం

Mega157: ‘మెగా157’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం

చిరంజీవి పుట్టినరోజున యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ట తెరకెక్కించనున్నారని తెలియచేశారు. ‘#మెగా157’ అభిమానుల మెగా సెలబ్రేషన్స్ ని రెట్టింపు చేసింది. పంచభూతాలతో కూడిన అనౌన్స్ మెంట్ పోస్టర్ సోషల్ మీడియా & ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ను యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈరోజు చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ప్రారంభించినట్లు అనౌన్స్ చేశారు.

ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి డివోపీగా పని చేస్తారని కూడా ఆయన తెలియజేశారు. #మెగా157 ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించాం. త్వరలో మీ అందరినీ సినిమాటిక్ అడ్వంచర్ కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని ట్వీట్ చేసిన వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, డీవోపి తో కలసివున్న ఫోటోని షేర్ చేశారు. ఈ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ ప్రాజెక్ట్ కు సంబధించిన ఇతర తారాగణం, టెక్నికల్ టీంను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఉండే సోషియో ఫాంటసీ మూవీ అని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్