మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ నటిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఏంటి అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారని టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. మలినేని డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి కూడా టైటిల్ ఇంకా ప్రకటించలేదు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర టైటిల్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేయనున్నారని సమాచారం.
చిరంజీవి తన సినిమాకి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమాలో చిరంజీవి పేరు వీరయ్య. ఇక బాలయ్య తాను నటిస్తున్న సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో మెయిన్ రోల్ పేరు వీరసింహా రెడ్డి. అదే ఈ సినిమాకి టైటిల్ కానుంది. ఇలా చిరంజీవి, బాలయ్య సినిమాల పాత్రల్లో, సినిమా టైటిల్స్ లో వీర అనేది కామన్ గా మారడం విశేషం. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు వీరత్వం చూపిస్తారో చూడాలి.