Friday, October 18, 2024
HomeసినిమాKarthik Dandu: 'విరూపాక్ష' దర్శకుడికి మెగా ఆఫర్

Karthik Dandu: ‘విరూపాక్ష’ దర్శకుడికి మెగా ఆఫర్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు.  ఆగష్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే.. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. ఓ అరడజను డైరెక్టర్స్ చిరంజీవితో సినిమా చేసేందుకు కథలు సిద్ధం చేస్తున్నారు.

కళ్యాణ్ కృష్ణ, మల్లిడి వశిష్ట్ లతో సినిమాలు చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పారు. ఈ రెండు సినిమాల  ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. బి.వి.ఎస్.రవి ఓ కథ చెప్పారు కానీ దీనికి దర్శకుడి కోసం చూస్తున్నారు. ఇదిలా ఉంటే…  ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో కూడా సినిమా చేసేందుకు చిరు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. విరూపాక్ష సినిమాకి 45 కోట్ల లాభం వచ్చింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ దండును చిరంజీవి పిలిచి అభినందించారట. అంతే కాకుండా మంచి స్టోరీ లైన్ ఉంటే చెప్పు.. సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ అదే పనిలో ఉన్నాడని తెలిసింది. చిరంజీవిని తన కథతో మెప్పిస్తే.. మాత్రం కార్తీక్ దండు దశ తిరిగినట్టే. మరి.. చిరు ఇచ్చిన ఆఫర్ ను ఎంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్