Saturday, January 18, 2025
Homeసినిమాద‌స‌రా బరిలో చిరు, బాలయ్య?

ద‌స‌రా బరిలో చిరు, బాలయ్య?

War Repeat: మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌ప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నువ్వా..?  నేనా..? అన్న‌ట్టుగా పోటీప‌డ్డారు. ఆమ‌ధ్య చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఒక రోజు గ్యాప్ లో రిలీజై పోటీప‌డ్డాయి. ఈసారి మ‌ళ్లీ చిరు, బాల‌య్య పోటీకి సై అంటున్నారు. దీంతో ఈ ఆస‌క్తిక‌ర పోటీలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అనేది ఆస‌క్తిగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాద‌ర్. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తుండ‌డం విశేషం. అంతే కాకుండా.. చిరు, స‌ల్మాన్ క‌లిసి ఈ సినిమాలో ఓ పాట‌కు డ్యాన్స్ చేస్తుండ‌డంతో గాడ్ ఫాద‌ర్ మూవీ పై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీని ఆగ‌ష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఆచార్య ఎఫెక్ట్ తో కాస్త లేట్ గా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ద‌స‌రాకి గాడ్ ఫాద‌ర్ మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక బాల‌య్య విష‌యానికి వ‌స్తే… అఖండ సినిమా స‌క్సెస్ తో మంచి ఊపు మీదున్న బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీని ద‌స‌రాకి రిలీజ్ చేయ‌నున్నారు. దీంతో ఈ ద‌స‌రాకి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ చిరు, బాల‌య్య మ‌ధ్య పోటీ ఏర్ప‌డింది. మ‌రి.. ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో చూడాలి.

Also Read : చిరు మూవీలో నితిన్. ఇది నిజ‌మేనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్