Sunday, January 19, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్ కోసం ఒకే వేదికపైకి చిరు, బాల‌య్య‌?

ఆర్ఆర్ఆర్ కోసం ఒకే వేదికపైకి చిరు, బాల‌య్య‌?

Chiru, balayya also:  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రారంభం నుంచి ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా..? అని నంద‌మూరి, మెగా అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కుల సైతం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా హైద‌రాబాద్ లో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలిసింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహ బాల‌కృష్ణ ముఖ్య అతిథులుగా హాజ‌రు కానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చిరు, బాలయ్య ఒక వేదిక పైకి వస్తే చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది.  నాలుగు దశాబ్దాలుగా  తెలుగు చిత్ర సీమలో వీరిద్దరి నట ప్రస్థానం పోటాపోటీగా సాగుతూ వస్తుతోంది. అందుకే.. వీరి  కలయిక ఎప్పుడూ సెన్సేషనే.

ఈసారి ఈ ఇద్దరి కలయిక రూమర్ కాదు, నిజమే అని టాక్ వినిపిస్తోంది. త్వరలో గ్రాండ్ గా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక‌ను చేయ‌నున్నారు. ఎప్పుడు..?  ఎక్క‌డ‌..? అనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. చిరు, బాల‌య్య రావ‌డం క‌నుక నిజ‌మైతే.. అటు మెగా, ఇటు నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గే.

Also Read : ఆర్ఆర్ఆర్.. టిక్కెట్ల బుకింగ్ లో సరికొత్త రికార్డ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్