Sunday, January 19, 2025
Homeసినిమామెగా 154 లేటెస్ట్ అప్ డేట్

మెగా 154 లేటెస్ట్ అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి వాల్తేరు వీర‌య్య అనే టైటిల్ ఖరారు చేయ‌నున్నారు. ఈ ప‌క్కా మాస్ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి వీరాభిమాని అయిన బాబీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండ‌డంతో ఈ సినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నామ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌డంతో మరింత ఆస‌క్తిగా ఈ మూవీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ర‌వితేజ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యార‌ని అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ తెలిసింది. ఏంటంటే.. ఈ మూవీ టీజ‌ర్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేయ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేశార‌ని తెలిసింది. ఇంత‌కీ ఎప్పుడంటే.. చిరు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌ష్టు 22న విడుద‌ల చేయ‌నున్నారు.

ఆచార్య సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో మెగాస్టార్ త‌దుప‌రి చిత్రాల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ మూవీ సంక్రాంతికి వ‌స్తే.. మాస్ ఆడియ‌న్స్ కి ఓ ట్రీట్ లా ఉంటుంద‌ని భావిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో రూపొందుతోన్న వాల్తేరు వీర‌య్య మూవీ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. సంక్రాంతికి వ‌స్తున్న వాల్తేరు వీర‌య్య ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్