Sunday, January 19, 2025
Homeసినిమాచిరు నిర్ణ‌యంతో ఫ్యాన్స్ షాక్!

చిరు నిర్ణ‌యంతో ఫ్యాన్స్ షాక్!

Digital Entry: మెగాస్టార్ చిరంజీవి వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌తి పండ‌గ‌కి ఓ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ద‌స‌రాకి గాడ్ ఫాద‌ర్, సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌, ఉగాదికి భోళా శంక‌ర్ చిత్రాలు రిలీజ్ ప్లాన్ చేశారు. ఇలా వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల‌కు ప్లాన్ చేస్తుండ‌డంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. అయితే.. లేటెస్ట్ గా చిరు తీసుకున్న నిర్ణ‌యంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ఓ వైపు వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే మ‌రో వైపు డిజిట‌ల్ ఎంట్రీకి రెడీ అవుతున్నార‌ట‌. త్వ‌రలోనే ఓ వెబ్ సిరీస్ లో న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ట‌. ప్రేక్ష‌కులు థియేట‌ర్ క‌న్నా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కుటుంబ సభ్యులు అంద‌రూ క‌లిసి చూడ‌చ్చు అనే ఉద్దేశ్యంతోనే ఓటీటీకే ఓటు వేస్తున్నారు. అందుక‌నే ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా సీనియ‌ర్ హీరోలు మారుతున్నారు. బాల‌య్య‌, నాగ్, వెంకీ ఆల్రెడీ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు చిరంజీవి కూడా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని టాలీవుడ్ లో టాక్ గ‌ట్టిగా వినిపిస్తుంది. రెండు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ చేయ‌డానికి ఫిక్స్ అయ్యాయ‌ట‌. ఇటీవ‌ల చిరంజీవిని క‌లిసి ఈ విష‌య‌మై చ‌ర్చించార‌ని తెలిసింది. ఇది తెలిసిన‌ప్ప‌టి నుంచి మెగా అభిమానులు కాస్త టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ఓ వైపు వ‌రుస‌గా సినిమ‌లు మ‌రో వైపు ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తే.. క్రేజ్ ఉంటుందో లేక‌ త‌గ్గిపోతుందో అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి.. వెబ్ సిరీస్ కోసం చిరు ఎలాంటి క‌థ‌ను ఎంచుకుంటారో..? ఎంత వ‌ర‌కు మెప్పిస్తారో చూడాలి.

Also Read : చిరంజీవి పేరు మార్చుకున్నారా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్