Acharya Duration: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ క్రేజీ మూవీ ఆచార్య. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తే… చరణ్ సరసన పూజా హేగ్డే నటించింది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆచార్య కరోనా కారణంగా బాగా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
దేవాలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్న అవినీతిపరుల భరతం పట్టే నక్సలైట్లుగా ఈ సినిమాలో చిరంజీవి – చరణ్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా నిడివి 3 గంటలకి పైగా వచ్చిందట. 3 గంటల నిడివి ఓకేనా? ఆడియన్స్ కి బోర్ అనిపిస్తుందా? అనే విషయంలో చిరు, కొరటాల తర్జనభర్జనలు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఓ పావుగంట నిడివిని తగ్గిస్తే ఎలా ఉంటుందా అనే విషయం గురించి ఇద్దరూ ఆలోచిస్తున్నారట.
త్వరలోనే ఆచార్య రన్ టైమ్ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ ముంబాయిలో జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆచార్య రన్ టైమ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారట. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఆచార్య సినిమాలో, సోనూసూద్ .. సంగీత .. పోసాని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనుండగా, స్పెషల్ సాంగ్ లో రెజీనా మెరవనుంది. మరి..ఈ ఆచార్య సినిమాతో తండ్రీకొడుకులు చిరు, చరణ్ ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.