Monday, January 20, 2025
HomeTrending Newsలోకేష్ పాదయాత్రకు అనుమతి

లోకేష్ పాదయాత్రకు అనుమతి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి నిర్వహించ తలపెట్టిన ‘యువ గళం’ పాదయాత్ర కు అనుమతి లభించింది. యాత్ర మొదలయ్యే చిత్తూరు జిల్లా ఎస్పీ ఈ మేరకు అనుమతి పత్రం జారీ చేశారు. నిబంధనలకు లోబడి పాదయాత్ర జరగాలని, పాదయాత్రలో ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని  ఎస్పీ సూచించారు.

ఎల్లుండి 25న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకుంటారు. 26 న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని అనంతరం సాయంత్రానికి కుప్పం చేరుకుంటారు. 27న ఉదయం 11 గంటలకు కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి దేవాలయం వద్ద పూజల అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. కమతమూరు క్రాస్ రోడ్స్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొదటి రోజు కేవలం ఏడు కిలోమీటర్ల మేర యాత్ర ఉంటుంది.

Also Read : జనవరి 27నుంచి లోకేష్ పాదయాత్ర! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్