కింగ్ డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ సమర్పణలో రమణారెడ్డి గడ్డం దర్శకత్వంలో విశాల పసునూరి నిర్మిస్తోన్నచిత్రం ‘సిఐ భారతి’. నరేంద్ర, గరిమా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రారంభోత్సవం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్పిప్ట్ అందజేశారు. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ…“రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సిఐ భారతి ఒక పవర్ ఫుల్ స్టోరి. మంత్రి మల్లా రెడ్డి గారు, నటుడు అలీ గారు మా చిత్రం ప్రారంభోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్టడం జరిగింది. మా సినిమా ద్వారా వచ్చే రిటర్స్న్ లో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గతంలో నేను రెండు సినిమాలు చేశాను. ఇక మీదట కూడా కంటిన్యూగా సినిమాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయనున్నాం“ అన్నారు.
సమర్పకులు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ…“ దర్శకుడు రమణారెడ్డి గారు బౌండెడ్ స్క్పిప్ట్ తో వచ్చారు. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకొచ్చాను. రమణా రెడ్డి గారు అన్నీ తానై సినిమా చేస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని నేను ప్రొడ్యూస్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
హీరో నరేంద్ర మాట్లాడుతూ…“ రమణా రెడ్డి గారు అద్భుతమైన కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఐదు అద్భుతమైన పాటలున్నాయి. ఒక మంచి స్క్రిప్ట్ లో హీరోగా నటించడం చాలా సంతోషం. దర్శకుడు రమణా రెడ్డి గారు నా క్యారక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం“ అన్నారు.
హీరోయిన్ గరిమా మాట్లాడుతూ…“సిఐ భారతి చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు“ అన్నారు.
నటీ-నటులు
హీరో నరేంద్ర, హీరోయిన్ గరిమా..
సమర్పణ : ఘర్షణ శ్రీనివాస్
బ్యానర్ : కింగ్ డమ్ మూవీస్
నిర్మాత : విశాల పసునూరి
కో-ప్రొడ్యూసర్ః రేణుక కాసుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః వెంకటేశ్వరరావు
డైరెక్టర్ : రమణారెడ్డి గడ్డం
మ్యూజిక్ : ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రాఫర్ : శ్రీనివాస రెడ్డి
ఎడిటర్ :రామారావు
ఆర్ట్ః ఆనంద్
డాన్స్ః హరి
పి. ఆర్. ఓ : చందు రమేష్
Also Read : గువేరా ఫిల్మ్స్ కొత్త సినిమా షూటింగ్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు