Sunday, January 19, 2025
HomeTrending Newsప్రభుత్వ అడ్వైజర్ గా అలీ

ప్రభుత్వ అడ్వైజర్ గా అలీ

సినీ నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అలీ గత ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. జగన్ సిఎం అయిన తరువాత ఎఫ్ డి సి ఛైర్మన్ గా అలీని నియమించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి, కానీ సాధ్యపడలేదు.

గత రాజ్య సభ ఎన్నికల ముందు సిఎం జగన్ తో అలీ సమావేశమయ్యారు. ఆ సందర్భంలో కీలక పదవి ఇస్తానని జగన్ అలీకి హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి, దీనితో అలీని రాజ్యసభకు పంపుతారని అందరూ భావించారు. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో అది సాధ్య పడలేదు. ఎన్నికలకు మరో 19 నెలలు సమయం మాత్రమే ఉండడంతో అలీని ప్రభుత్వ సలహాదారుగా కేబినేట్ పోస్టులో నియమించారు. ఈ రెండేళ్లపాటు ఆయన సేవలను పార్టీకి విస్తృతంగా వినియోగించుకోవాలని సిఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్