Sunday, January 19, 2025
HomeTrending Newsప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ జడ్జికి కాన్పు

ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ జడ్జికి కాన్పు

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానాలు పటిష్టమై.. మంచి చికిత్స అందిస్తూ పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆర్మూరు జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న రాచర్ల శాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవఖానాలో ప్రసవించి, పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో నేడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబసమేతంగా వెళ్లి అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి తో పాటు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కలిసి ఆమెను, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. కేసీఆర్ కిట్ అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

_అనంతరం మీడియాతో మాట్లాడారు…

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయి. వరంగల్ జిల్లాలో ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్లను రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ దవఖానాలలో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలలో 80 నుంచి 90 శాతం వరకు ఆపరేషన్లు లేకుండా నార్మల్ డెలివరీలు జరుగుతుండగా.. ప్రైవేటు హాస్పిటల్లో 60 నుంచి 70 శాతం ఆపరేషన్లు జరుగుతున్నట్లు నివేదిక ఉన్నది. ప్రభుత్వ దవాఖానాలు ట్రీట్మెంట్ బాగా అందిస్తూ… పేదల పెన్నిధిగా మారాయి. కెసిఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి 12 వేల రూపాయలు అందిస్తున్నారు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మంత్రి సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి ఉషా దయాకర్ రావు, హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్