వచ్చే నెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. ఎన్డీయే కూటమికి వైకాపా, బిజూ జనతాదళ్ మద్దతిస్తాయని జోరుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. అది నిజమే అయితే ముర్ముకు 56% వరకు ఓట్లు లభిస్తాయి. ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న మరికొన్ని పార్టీలు కూడా ఎన్డీయే వైపే మొగ్గితే.. మెజార్టీ మరింత పెరుగుతుంది.
అధికారిక కూటమి గిరిజన అభ్యర్థిని తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపిన నేపథ్యంలో విభిన్న పార్టీలకు చెందిన బడుగు, బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు క్రాస్‌ఓటింగ్ ద్వారా మద్దతు పలికేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.