Sunday, June 14, 2026
HomeTrending Newsగంధం తనయుడికి సిఎం అభినందన

గంధం తనయుడికి సిఎం అభినందన

పర్వతారోహకుడు గంధం భువన్ జై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్‌ను ప్రపంచంలోనే అతి పిన్నవయసులో (8 సంవత్సరాల 3 నెలలు) అధిరోహించిన బాలుడిగా గంధం భువన్‌ జై రికార్డు సృష్టించాడు.

మాస్టర్‌ గంధం భువన్‌ జై  రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తనయుడు కావడం గమనార్హం. భువన్‌ జై ప్రతిభను సిఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. భువన్ తోపాటు గంధం చంద్రుడు, కోచ్‌ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ కూడా సిఎంను కలిసినవారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular