పంజాబ్ పై ముంబై విజయం

ఐపీఎల్ లో నేడు జరిగిన మరో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ పై ఆరు వికెట్లతో విజయం సాధించింది.  టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నారు. కింగ్స్ జట్టు మరోసారి బ్యాటింగ్ లో తడబడింది. మార్ క్రమ్- 42 (29బంతుల్లో 6 ఫోర్లు);  దీపక్ హుడా-28(26 బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్ ) ; కెప్టెన్ రాహుల్-21(22 బంతుల్లో 2 ఫోర్లు) మినహా మిగిలినవారు రాణించలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 135  పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, పోలార్డ్ చెరో రెండు వికెట్లు, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా ముంబై మొదట్లో తడబడింది.  కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ డికాక్ 29 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయాడు. ఆ తర్వాత సౌరబ్ తివారీ, హార్దిక్ పాండ్యా రాణించి జట్టును విజయ తీరాల వైపు నడిపించారు. తివారీ-45 (37బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు); హార్దిక్-40 నాటౌట్ (30బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) చివర్లో కీరన్ పోలార్డ్-15(7బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్) పరుగులు చేశారు. దీనితో మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ముంబై విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్-2, నాథన్ ఎలీస్, షమీ చెరో వికెట్ పడగొట్టారు.

బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటిన పోలార్డ్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్  దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *