Sunday, January 19, 2025
HomeTrending Newsమంత్రులు, అధికారులకు సిఎం అభినందన

మంత్రులు, అధికారులకు సిఎం అభినందన

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అభినందించారు.  విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్, రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులకు గాను 378 ఒప్పందాలు కుదిరాయి, వీటి ద్వారా 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది.

ఈ ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే  ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటుచేశారు.  ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.షన్‌మోహన్‌ పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్