Monday, September 23, 2024
HomeTrending Newsఉద్యోగులకు మంచి చేశాం: సిఎం జగన్

ఉద్యోగులకు మంచి చేశాం: సిఎం జగన్

We did well: ఉద్యోగ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు మంచి చేయాలనే సంకల్పంతోనే పీఆర్సీ ప్రకటనతో సహా వారి పదవీ విరమణ వయస్సును రెండేళ్లపాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కోవిడ్ విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. యుద్ధప్రాతిపదికన కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఆదికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం సూచనలు:

⦿ కారుణ్య నియామకాల ప్రక్రియ ఖాళీల గుర్తింపుతో ఆలస్యం కాకుండా చూడాలి
⦿ అందుకే గ్రామ, వార్డు సచివాలయ్యాల్లో ఈ కారుణ్య నియామకాలు చేపట్టాలి
⦿ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో 10శాతం స్థలాలను 20శాతం రిబేట్ పై ఇవ్వాలి
⦿ ఎంఐజి లేఔట్లలో వీరికి స్థలాలను ఇవ్వాలని నిర్ణయించాం
⦿ మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్టర్ చేయాలి
⦿ ఉద్యోగులతో పాటు స్థలాలు కోరుతున్న ఇతర లబ్ధిదారుల పేర్లు కూడా నమోదు చేయాలి
⦿ సేకరించిన స్థలాల్లో ఐదు శాతం పెన్షనర్లకు రిజర్వ్ చేయాలి
⦿ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించాలి
⦿ జూన్ ౩౦ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి, జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి
⦿ మిగిలిన 25 శాతం ఉద్యోగుల ప్రొబేషన్ పరీక్షలు కూడా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి

Also Read : సిఎస్ కు ఉద్యోగ సంఘాల నోటీసు

RELATED ARTICLES

Most Popular

న్యూస్